<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[V1]
 అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
 నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2)

[V2]
 మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
 నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
 నీ కృపలో బహుగా ఫలించుటకు
 ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
 అంగీకరించుము నా సమర్పణ // అంకితం //

[V3]
 కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
 చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
 నీ సన్నిధిలో ప్రకాశించుటకు
 అంధకార ఛాయలను తొలగించుటకు (2)
 అంగీకరించుము నా సమర్పణ // అంకితం //</lyrics>
<title>అంకితం ప్రభూ నా జీవితం</title>
<hymn_number>336</hymn_number>
</song>